Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

పైసల్ కే సలాం  జెండా మోసిన వారికి అన్యాయం..!!

పైసల్ కే సలాం

జెండా మోసిన వారికి అన్యాయం..!!

నాగలాపురం, (గరుడదాద్రి )

 

క్రమశిక్షణతో ఉంటూ లంచాలకు అవకాశం లేకుండా పాలన సాగించాలని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదేపదే అధికారులను, నాయకులను కోరుతూ వస్తున్నారు అయితే వారు చెప్పేదేంటి… మా రూటే సప *రేటు* అనే విధంగా తిరుపతి జిల్లాలోని కొందరు మండల పార్టీ అధ్యక్షులు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది ఈ పరిస్థితి నాగలాపురంలో కూడా ఉంది దాంతో అధికార టిడిపిలో పార్టీ విజయం కోసం పని చేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ మండలంలో పల్లె పండుగ పనులకు, ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ల నియమాకం, డీలర్ షిప్ లో మార్పులు, సంఘమిత్రల మార్పులు, తొలగింపులు, గోకులం షెడ్ల కేటాయింపు పనుల్లో కూడా ఎప్పుడు లేని విధంగా మండల పార్టీ అధ్యక్షునికి నజరాణాలు చెల్లించాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని మండల టిడిపి కేడర్ లబోదిబో మంటోంది ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ఇంకొందరు మండల అధ్యక్షులు తీరు కూడా సరిగా లేదని టిడిపి శ్రేణులు, పంచాయతీ స్థాయి నాయకులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఇంకో అడుగు ముందుకు వేసి మరికొందరు ఏకంగా పోలీసులు, మైనింగ్, రవాణా శాఖ అధికారులు పేర్లు మీద కూడా డబ్బులు దండుకోవడం ఎప్పుడు జరిగిన కొత్త అంశంగా ఉందని టిడిపి సీనియర్ నాయకులు చెబుతున్నారు పార్టీ అబ్జర్వర్ పాత్ర కూడా కొన్ని అంశాల్లో విమర్శలకు దారితీస్తోంది ఇటు ఎమ్మెల్యే ను సస్పెండ్ చేయడం, అటు స్థానికేతర నేతల ప్రభావం ఎక్కువ కావడంతో మండలాల్లో పార్టీ పరిస్థితి విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోతోందని కుమిలిపోతున్నారు తక్షణం టిడిపి అధిష్టానం సత్యవేడు విషయంలో దృష్టి పెట్టి అన్ని పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Related posts

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

Job Notifications

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

Job Notifications

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

Job Notifications

Leave a Comment