Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు HC శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లు సస్పెండ్.*

*తిరుపతి జిల్లా…*

 

⏩ *క్రమశిక్షణ చర్యలు*

 

⏩ *ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు HC శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లు సస్పెండ్.*

 

⏺️ పాకాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వీరిని క్రమశిక్షణ చర్యలలో భాగంగా సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు.

 

⏺️ ఒక రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేయకుండా అలసత్వం ప్రదర్శించి, ముద్దాయి పేరును తారుమారు చేసినట్లు ఆరోపణలు.

 

⏺️ బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వర్తిస్తూ, చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు విచారణలో ప్రాథమిక నిర్ధారణ.

 

⏺️ క్రమశిక్షణా చర్యలలో భాగంగా సదరు పాకాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు స్టేషన్ రైటర్ HC – 2839 శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లను వెంటనే సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు ఉత్తర్వులు జారీ చేశారు.

 

⏺️ పోలీసులు చట్ట ప్రకారం చిత్తశుద్ధి, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీసులను హెచ్చరించారు.

Related posts

Post Office: రోజుకి 95 రూపాయలు తో ఒకేసారి 14 లక్షలు పొందండి.. వివరాలు

Job Notifications

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

Job Notifications

LIC Pension Scheme: ఒక్కసారి పెట్టుబడి తో ఏడాదికి 60 వేల పెన్షన్..

Job Notifications

Leave a Comment