Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్

 

తిరుమలలో ప్రసాదాల కలుషిత

నెయ్యి పై రాజకీయమా పరిష్కారమా అంటూ

 

ఘాటు లేఖ రాసిన బోడె రామచంద్ర యాదవ్

 

గరుడదాత్రి ప్రతినిధి గురువారం 17

చిత్తూరు జిల్లా పుంగనూరు లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కోట్ల ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల కలుషిత నెయ్యి విషయంపై

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ రోజు ఓ ఘాటు లేఖ రాశామన్నారు

తిరుమల నెయ్యి అంశంపై పరిష్కార మార్గాలు సూచిస్తూ పది రోజుల కిందటే రాసిన లేఖపై ముఖ్యమంత్రి నుండి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం ఆ అంశాలను ప్రస్తావిస్తూ మరి కొన్ని అంశాలను చేర్చారు.. రాజకీయాలను పక్కన పెట్టీ తిరుమల పవిత్రత, పరిరక్షణ విషయంలో చర్యలు తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రత, పరిరక్షణపై మీకు రాజకీయం కావాలా పరిష్కారం కావాలా

తిరుమల పవిత్రత కాపాడే విషయంలో కొన్ని కీలక సూచనలు, సలహాలతో మీకు గతంలోనే (అక్టోబరు 5 న) ఒక లేఖను రాసాను.. ఆ లేఖలో తిరుమల వేంకటేశ్వర స్వామి వారి పట్ల నాకు, మీకు ఉన్న అనుబంధాన్ని చాలా స్పష్టంగా గుర్తు చేసాను.. మన పూర్వీకుల, మన అదృష్టం కొద్దీ ఆ స్వామి వారిని తాకిన గాలిని పీల్చి, ఆ స్వామి కొండల నీడన, ఆ స్వామి వెలసిన గడ్డపై పుట్టి, పెరిగాము.. ఆ స్వామి పట్ల భక్తి, ఆ కొండల పవిత్రత పట్ల అంకితభావం, ఆ క్షేత్రం పరిరక్షణ పట్ల శ్రద్ధ విషయంలో నేను ఒకింత కూడా రాజీ పడను, మీరు కూడా పడరనే నమ్మాను.. అందుకే మీకు లేఖల ద్వారా విషయాన్ని తెలియజేస్తున్నాను.

తిరుమలకు ప్రస్తుతం అతి పెద్ద సమస్య నెయ్యి స్వామి వారి దీపం, నైవేద్యం, భక్తులకు ఇచ్చే ప్రసాదాలు అన్నిటికీ వినియోగించే నెయ్యి విషయంలో సాక్షాత్తు మీరే ఒక సంచలన ఆరోపణ చేసి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మరి ఆ నెయ్యి కల్తీ లేకుండా శాశ్వత మార్గమేది కాంట్రాక్టరుని మారిస్తే సరిపోతుందా సీబీఐ, సిట్ విచారణ చేస్తే సరిపోతుందా మళ్ళీ భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వచ్చి ఇదే తరహాలో ఆరోపణలు చేస్తే భక్తుల మనోభావాలు ఏమవ్వాలి దీనికి శాశ్వత కట్టడి ఎప్పుడు శాశ్వత ముగింపు ఎప్పుడు శాశ్వత పరిష్కారం ఎప్పుడు “రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు.. మీకంటే గొప్ప అనుభవమున్న, తెలివైన రాజకీయ నాయకుడు లేకపోవచ్చు కానీ స్వామి వారి విషయంలో తగదు ఇది ఒక మతం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది మనసు, నొ చ్చుకుంటుందన్నారు తిరుమల వివాదంలో మీలో ఇప్పటి వరకు రాజకీయం కనిపించిందే తప్ప పరిష్కారం కనిపించలేదు! సూటిగా ప్రశ్నించారు

మీకు పరిష్కారం కావాలి అంటే.. గతంలో నేను రాసిన లేఖలో లేవనెత్తిన రెండు కీలక అంశాలపై మీ నుండి సానుకూల స్పందన ఆశిస్తున్నాను. భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి సమస్యలు తలెత్తని పరిష్కార మార్గాలుగా నేను ప్రతిపాదించిన రెండు అంశాలు మరోసారి గుర్తు చేస్తున్నానన్నారు* నెయ్యి బయట కొనుగోలు చేసే కంటే సొంతంగా తయారు చేసుకోవడం అత్యుత్తమ మార్గం.. మీ ప్రభుత్వం దీనికి సిద్ధమైతే నేనే స్వయంగా నా తరపున వేయి గోవులను ఇస్తాను. అలాగే మరో లక్ష గోవులను ఉచితంగా సమకూర్చే బాధ్యత తీసుకుంటాను. నేను వేయి ఇవ్వడంతో పాటూ, నా లాంటి భక్తులను సంప్రదించి సమీకరించగలను.* మీరు ఏర్పాటు చేయబోయే తిరుమల దేవస్థానం పాలకమండలిలో చైర్మన్ సహా సభ్యులు అందరూ ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులుగా ఉండేలా చూడగలరని మనవి. రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాలకు చెందిన వ్యక్తులను ఈ బోర్డులో స్థానం కల్పించకుండా ఆద్యంతం భక్తి, శ్రద్ధలతో స్వామిని కొలిచే నిజమైన భక్తులకు మాత్రమే స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాను. అవసరమైతే మిమ్మల్ని నేరుగా కలిసి వీటిపై మరింత స్పష్టంగా, వివరంగా, శాశ్వత పరిష్కార మార్గాలుగా, పూర్తిగా వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు

Related posts

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

Job Notifications

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

Job Notifications

రేపు విద్యుత్ అంతరాయం* 

Job Notifications

Leave a Comment