Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

మహాత్మా గాంధీ ఆలోచన , పరిశుభ్ర గ్రామీణ పట్టణ భారతదేశం . మహాత్ముని ఆశయ సాధన కోసం 2014  అక్టోబర్ రెండవ తేదీన గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ అభయాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు . పట్టణ ప్రాంతాలలో పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణ ప్రాంతాలలో తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అమలు చేస్తారు. ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ లో ప్రారంభించారు . ఈ ప్రారంభ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖులంతా పలు పట్టణాలలో పాల్గొన్నారు. అనిల్ అంబానీ , సచిన్ టెండూల్కర్ , బాబా రాందేవ్ , కమలహాసన్ మొదలగు అనేక దిగ్గజాలు కార్యక్రమంలో పాల్గొన్నారు . స్వచ్ఛభారత్ దేశంలో 4041 పైగా పట్టణాల్లో అమలు చేశారు . మొత్తం ఖర్చు 62,009 కోట్ల రూపాయలు . దీనిలో కేంద్ర ప్రభుత్వం వాటా 14,623 కోట్ల రూపాయలు.ఈ కార్యక్రమాన్ని విశాఖలో నాటి పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు  బిజెపి  వైద్య విభాగం ఆధ్వర్యంలో , ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్  లో ప్రారంభించి , ఐదు సంవత్సరాలలో నగరంలో అనేక స్వచ్ఛభారత కార్యక్రమాలలో పాల్గొని విశాఖ ప్రజలకు , అధికారులకు స్ఫూర్తిని ఇచ్చారు.
విశాఖకు స్వచ్ఛభారత్ స్వచ్ఛతాహి సేవలో 3,6,9 స్థానములు లభించాయి. స్మార్ట్ సిటీగా రూపు దిద్దుతున్న విశాఖలో స్వచ్ఛభారత్ ద్వారా సందర్శకుల తాకిడి కూడా ఎక్కువైంది . మన ఇల్లు , మన సమాజం పరిశుభ్రత లక్ష్యముగా స్వచ్ఛభారత్  కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం .

Related posts

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు 

Job Notifications

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

Job Notifications

LIC Pension Scheme: ఒక్కసారి పెట్టుబడి తో ఏడాదికి 60 వేల పెన్షన్..

Job Notifications

Leave a Comment